![]() |
![]() |

దర్శకుడిగా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి అగ్ర కథానాయకులతోనే సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు వంశీ పైడిపల్లి. అలాంటి వంశీకి మే 2 ఎంతో స్పెషల్. ఎందుకంటే.. సరిగ్గా 15 ఏళ్ళ క్రితం ఇదే మే 2న వంశీ పైడిపల్లి తెరకెక్కించిన తొలి చిత్రం `మున్నా` (2007) విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మించిన ఈ సినిమా.. వంశీకి శుభారంభం ఇవ్వకపోయినా దర్శకుడిగా చెప్పుకోదగ్గ గుర్తింపుని తీసుకువచ్చింది.
ఆపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో రూపొందించిన `బృందావనం` (2010) వంశీ పైడిపల్లికి ఫస్ట్ సక్సెస్ ని అందించగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `ఎవడు` (2014), కింగ్ నాగార్జున `ఊపిరి`(2016), సూపర్ స్టార్ మహేశ్ బాబు `మహర్షి` (2019) చిత్రాలు కూడా విజయపథంలో పయనించాయి. ప్రస్తుతం కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ తో తెలుగు - తమిళ్ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు వంశీ పైడిపల్లి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి.. నేటితో 15 వసంతాల కెరీర్ ని పూర్తిచేసుకుంటున్న వంశీ పైడిపల్లి.. మున్ముందు కూడా జనరంజక చిత్రాలతో అలరిస్తారేమో చూడాలి.
![]() |
![]() |