![]() |
![]() |

ఆరు వారాలు దాటినా 'ఆర్ఆర్ఆర్' జోరు తగ్గట్లేదు. 38వ రోజు వరల్డ్ వైడ్ గా రూ.కోటికి పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. 32 రోజుల పాటు ప్రతిరోజూ కోటికి పైగా షేర్ రాబట్టిన 'ఆర్ఆర్ఆర్'.. 33వ రోజు నుంచి రూ.60 లక్షల రేంజ్ లోనే షేర్ వసూలు చేసింది. దీంతో 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల వేట దాదాపు ముగిసినట్లేనని భావించారంతా. కానీ 38వ రోజు అయిన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 38వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 43 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్.. వరల్డ్ వైడ్ గా 1.02 కోట్ల షేర్(2.20 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 267.83 కోట్ల షేర్ (405.05 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 603.69 కోట్ల షేర్(1122.30 కోట్ల గ్రాస్) రాబట్టింది.
38 రోజుల్లో ఆర్ఆర్ఆర్ నైజాంలో 111.10 కోట్లు(బిజినెస్ 70 కోట్లు), సీడెడ్ లో 50.75 కోట్లు(బిజినెస్ 37 కోట్లు), ఆంధ్రాలో 105.98 కోట్ల(బిజినెస్ 84 కోట్లు) షేర్ వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో 43.96 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 38.30 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళ 10.57 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), హిందీ 132.20 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 9.15 కోట్లు(బిజినెస్ 8 కోట్లు), ఓవర్సీస్ లో 101.68 కోట్ల(బిజినెస్ 75 కోట్లు) షేర్ తో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా 451 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది.
![]() |
![]() |