![]() |
![]() |

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన 'ఆచార్య' సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే బడా స్టార్ల సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ ఆచార్య విషయంలో మాత్రం అలా జరగట్లేదు. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.35 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ.. రెండో రోజు రూ.6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ఆచార్య'కు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో హైర్స్ తో కలిపి రూ.29.50 కోట్ల షేర్ వచ్చింది. అయితే రెండో రోజు మాత్రం 5.15 కోట్ల షేర్ మాత్రమే వచ్చిందట. ప్రభాస్ రీసెంట్ మూవీ 'రాధేశ్యామ్' కూడా మొదటి షో నుంచే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఆ సినిమా రెండో రోజు తెలుగు స్టేట్స్ లో 12.32 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కానీ ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన ఆచార్య మాత్రం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. నెగటివ్ టాక్ తో పాటు టికెట్ ధరల హైక్ కారణంగా ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండు రోజుల్లో ఆచార్య సినిమా నైజాంలో 10.10 కోట్లు, సీడెడ్ లో 5.23 కోట్లు, ఆంధ్రాలో 19.23 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా 34.65 కోట్ల షేర్(48.85 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. రెండు రోజులకు గానూ కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 2.22 కోట్లు, ఓవర్సీస్ 4.20 కోట్లు సాధించింది.
వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య.. మొదటి రోజు 35.05 కోట్ల షేర్(52 కోట్ల గ్రాస్), రెండో రోజు 6.02 కోట్ల షేర్(10.85 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 41.07 కోట్ల షేర్(62.85 కోట్ల గ్రాస్) సాధించింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 91 కోట్ల దూరంలో ఉన్న ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |