![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. 150 పైగా సినిమాలలో నటించి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన ఆయనకు అందరూ రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఆయనపై ట్రోల్స్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ 'ఆచార్య' పుణ్యమా అని మొదటిసారి ఆయనపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నిన్న విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఎలా ఉన్నా ఈ వయసులో కూడా చిరు డ్యాన్స్ లు, ఫైట్స్ తో అదరగొట్టాడని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ట్రోల్స్ కూడా దారుణంగా వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక చోట స్టోరీ పరంగా చిరంజీవి యంగ్ లుక్ లో కనిపించాల్సి ఉంది. దానికోసం వీఎఫ్ఎక్స్ వాడారు. అయితే ఆ వీఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ సీన్ కోసం చిరుని క్లీన్ షేవ్, లాంగ్ హెయిర్ తో మాములు లుక్ లో చూపించినా బాగుండేదని, అనవసరంగా వీఎఫ్ఎక్స్ వాడి ట్రోల్స్ కి ఛాన్స్ ఇచ్చారని మండిపడుతున్నారు.

'ఆచార్య'లో చిరు యంగ్ లుక్ ని చూసి కొందరు 'అమీర్ పెట్ ఎడిటింగ్', 'ఫేస్ యాప్ వాడారు' అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య 'సన్ ఆఫ్ ఇండియా'లోని ఒక సాంగ్ లో వాడిన వీఎఫ్ఎక్స్ పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో రెండు సినిమాలకు ఒకే వీఎఫ్ఎక్స్ టీమ్ పనిచేసిందా?.. వీఎఫ్ఎక్స్ ఇంత దారుణంగా ఉందంటే 'సన్ ఆఫ్ ఇండియా' టీమ్ పనే అయ్యుంటదిలే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
![]() |
![]() |