![]() |
![]() |

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన శ్రీవిష్ణు హీరోగా నటించిన 'భళా తందనాన' సినిమా మరోసారి వాయిదా పడింది. కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమాని ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. 'ఆచార్య' విడుదలైన(ఏప్రిల్ 29) మరుసటి రోజే రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్ ని కూడా మార్చి ట్విస్ట్ ఇచ్చారు.
'భళా తందనాన' సినిమాని మే 6న తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అదే రోజున మరో రెండు సినిమాల విడుదల ఉండటం విశేషం. బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్ర పోషించిన 'జయమ్మ పంచాయితీ' మే 6న విడుదల కానుంది. అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' కూడా అదే రోజున విడుదలవుతోంది. ఇప్పుడు అదే తేదీకి రావడానికి 'భళా తందనాన' సిద్ధమవుతోంది. మరి ఈ ట్రైయాంగిల్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన 'భళా తందనాన' సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ ట్రెసా నటించింది. అలాగే ఈ సినిమాలో 'కేజీఎఫ్'లో గరుడగా నటించి మెప్పించిన రామ్ చంద్ర విలన్ గా నటించగా.. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
![]() |
![]() |