![]() |
![]() |

స్వరవాణి కీరవాణి, మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. ఇద్దరూ ఇద్దరే. తెలుగునాట 30 ఏళ్ళకు పైగా సంగీత దర్శకులుగా రాణిస్తున్న ఈ అగ్ర స్వరకర్తలు.. పరభాషల్లోనూ తమదైన వేశారు. అలాగే, టాప్ స్టార్స్ తో విజయాలు చూడడమే కాకుండా.. కొన్ని ఇండస్ట్రీ హిట్స్ ని కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.
అలాంటి కీరవాణి, మణిశర్మ.. చాలా కాలం తరువాత ఒకే రోజున తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. అయితే, ఈ పోటీ పెద్ద సినిమాల కోసం కాదు.. లో - బడ్జెట్ మూవీస్ కోసం. ఆ వివరాల్లోకి వెళితే.. సుమ కనకాల ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విజయ్ కుమార్ కాలివరపు తెరకెక్కించిన `జయమ్మ పంచాయితీ` చిత్రం కోసం స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన సంగతి తెలిసిందే. కాగా, వేసవి కానుకగా మే 6న ఈ విలేజ్ డ్రామా.. జనం ముందుకు రానుంది. కట్ చేస్తే.. అదే మే 6న మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన `భళా తందనాన` మూవీ రిలీజ్ కి రెడీ అయింది. `బాణం` ఫేమ్ చైతన్య దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీ విష్ణు, కేథరిన్ ట్రెసా జంటగా నటించారు. మరి.. కీరవాణి వర్సెస్ మణిశర్మ అన్నట్లుగా ఉన్న మే 6 బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |