![]() |
![]() |

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కొరటాలకు మొదటి ప్లాప్ ని అందించడమే కాకుండా.. మెగా ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా రిజల్ట్ తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా కొంత ఆందోళన నెలకొందని అంటున్నారు.
రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ప్లాప్ అవుతుందని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. తాజాగా 'ఆచార్య' విషయంలోనూ ఆ సెంటిమెంట్ రిపీట్ అయింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్'లో చరణ్, తారక్ ప్రధానపాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటించిన సినిమా 'ఆచార్య'నే. ఈ సినిమా నేడు విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తారక్ నెక్స్ట్ మూవీపై పడింది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కూడా కొరటాల దర్శకత్వంలోనే కావడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' హీరోలను వరుసగా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన కొరటాల.. ఇప్పటికే చరణ్ తో ప్లాప్ అందుకొని రాజమౌళి సెంటిమెంట్ ని రిపీట్ చేశాడు. దీంతో తారక్ సినిమాకి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు తారక్ ఫ్యాన్స్ ఈసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'ఆచార్య' మూవీ ప్రమోషన్స్ లో కొరటాల.. ఆచార్య కంటే తారక్ తో చేయనున్న మూవీ గురించే ఎక్కువ కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. చాలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ అని, తారక్ రోల్ చాలా కాలం గుర్తుండిపోతుందని అన్నాడు. దీంతో కొందరు తారక్ ఫ్యాన్స్ 'ఆచార్య' రిజల్ట్ కొరటాలకు ముందే తెలుసని, అందుకే కాన్ఫిడెంట్ గా లేడని అంటున్నారు. అంతేకాదు తారక్-కొరటాల సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ కావడం ఖాయమని చెబుతున్నారు.
![]() |
![]() |