![]() |
![]() |

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మూవీ 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో మరో మెగా యంగ్ హీరో మెరిశాడు. అతను ఎవరో కాదు కొణిదెల పవన్ తేజ్.
చిరంజీవి కజిన్ కొడుకైన పవన్ తేజ్ గతేడాది విడుదలైన 'ఈ కథలో పాత్రలు కల్పితం' అనే సినిమాలో హీరోగా నటించాడు. పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా పవన్ తేజ్ కి హీరోగా గుర్తింపు తీసుకురాలేకపోయింది. అయితే ఈ యంగ్ హీరో మెగా మూవీ 'ఆచార్య'లో మెరిశాడు. చెడు వ్యసనాలను బానిసైన స్టూడెంట్ గా ఈ సినిమాలో పవన్ తేజ్ కనిపించాడు. మెగాస్టార్ తో ఓ ఫైట్ కూడా ఉండటం విశేషం. అతణ్ణి మరియు అతని గ్యాంగ్ ని చిరు కొట్టి బుద్ధి చెప్తాడు. అయితే ఈ మెగా మల్టీస్టారర్ కూడా పవన్ తేజ్ కి కలిసి రాలేదనే చెప్పాలి. హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన ఈ కొణిదెల వారబ్బాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పైగా మూవీ కూడా నెగటివ్ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాలో మరో టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ కూడా మెరిశాడు. శంకరన్న అనే స్పెషల్ రోల్ లో సత్యదేవ్ కనిపించాడు. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'గాడ్ ఫాదర్'లో కీలక పాత్రలో నటిస్తున్న సత్యదేవ్ మెగాస్టార్ మీదున్న అభిమానంతో ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించాడు.
![]() |
![]() |