![]() |
![]() |

ఎస్. జె. సూర్య మంచి దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా. రీసెంట్ టైమ్స్ లో ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో అలరించిన ఎస్. జె. సూర్య.. త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. తనకి ఇదే తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం.
కాగా, ఈ సిరిస్ లో ఎస్. జె. సూర్యతో పాటు నిన్నటి తరం అందాల తార లైలా కూడా నటించబోతోంది. `వదంతి` పేరుతో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ ని `విక్రమ్ - వేద` (2017) ఫేమ్ దర్శకద్వయం పుష్కర్ - గాయత్రి తెరకెక్కించనున్నారు. మరి.. సూర్య, లైలా కాంబినేషన్ లో వస్తున్న ఈ వెబ్ - సిరీస్ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే, సూర్య ఓ ముఖ్య పాత్రలో నటించిన `డాన్` చిత్రం మే 13న విడుదల కానుంది. మరోవైపు.. `బొమ్మై`, `కడమైయై సెయ్`, `మార్క్ ఆంటోని`, `ఇరవాకాలమ్`, `ఉయిరంద మణిదన్` వంటి తమిళ చిత్రాలు కూడా తన చేతిలో ఉన్నాయి. ఇక లైలా విషయానికి వస్తే కార్తి హీరోగా నటిస్తున్న తమిళ సినిమా `సర్దార్`లో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే పుష్కర్ - గాయత్రి డైరెక్ట్ చేసిన `విక్రమ్ - వేద` హిందీ వెర్షన్ సెప్టెంబర్ 30న రిలీజ్ కి రెడీ అయింది.
![]() |
![]() |