![]() |
![]() |

తెలుగు సినీ పుస్తకంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉంటాయి. ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. ఆయన సినిమా వస్తుంది అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. పాలిటిక్స్ కోసం పదేళ్లు బ్రేక్ తీసుకున్న ఆయన రీఎంట్రీ లోనూ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అయితే ఇంతటి స్టార్ కి ఇప్పుడో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రేపు(ఏప్రిల్ 29) విడుదలవుతున్న మెగాస్టార్ 'ఆచార్య' మూవీపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మూవీ చిరంజీవి గత చిత్రం 'సైరా నరసింహారెడ్డి'తో పోల్చితే అందులో 60 శాతం కూడా మొదటిరోజు కలెక్ట్ చేసే అవకాశం లేదని అంటున్నారు. సైరా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 51 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయగా.. ఆచార్య 28 కోట్ల లోపు షేర్ మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
'సైరా' మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.37 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే 'ఆచార్య' మాత్రం మొదటి రోజు మహా అయితే 25 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటించాడు, పైగా రామ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు. తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో పాటు.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావించారంతా. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ కి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇది అసలు మెగాస్టార్ మూవీనేనా అంటూ ఆశ్చర్య పోతున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. ఈ సినిమా అన్ సీజన్ లో విడుదలైంది, పైగా ఆ సమయంలో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే 26 కోట్లకు పైగా షేర్ వచ్చింది. 'భీమ్లా నాయక్'తో పోల్చితే 'ఆచార్య'కు చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. చిరు, చరణ్ కలిసి నటించారు. అపజయం ఎరుగని కొరటాల శివ డైరెక్ట్ చేశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల హైక్ లభించింది. అయినప్పటికీ ఈ సినిమా ఏపీ, తెలంగాణలో కలిసి ఫస్ట్ డే 25 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే అంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలకు పెంచినట్లు ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచడం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పై కాస్త ప్రభావం చూపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |