![]() |
![]() |

ఫ్లాప్స్ తో కెరీర్ ని ప్రారంభించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఒక దశలో వరుస విజయాలతో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది. `అరవింద సమేత వీర రాఘవ`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. ఇలా ఏకంగా ఐదు విజయాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకుందీ టాలెంటెడ్ బ్యూటీ.
కట్ చేస్తే.. కేవలం 50 రోజుల్లో అమ్మడి ట్యాగ్ మళ్ళీ మారిపోయింది. మార్చి 11 - ఏప్రిల్ 13 - ఏప్రిల్ 29.. ఇలా ఈ మూడు తేదీల్లో పూజ కథానాయికగా నటించిన మూడు భారీ చిత్రాలు విడుదలై నెగటివ్ టాక్ మూటగట్టుకున్నాయి. మార్చి 11న వచ్చిన పాన్ - ఇండియా మూవీ `రాధే శ్యామ్` డిజాస్టర్ గా నిలవగా.. ఏప్రిల్ 13న వచ్చిన `బీస్ట్` కూడా అదే బాట పట్టింది. ఇక ఈ రోజు (ఏప్రిల్ 29) జనం ముందు నిలిచిన `ఆచార్య` కూడా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన రీతిలో లేకపోవడంతో.. `ఆచార్య`తో పూజ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ చేరడం ఖాయమనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద.. కేవలం 50 రోజుల్లో 3 ఫ్లాప్స్ మూటగట్టుకుని మరోసారి వార్తల్లో నిలిచింది పూజ. మరి.. రాబోయే చిత్రాలతోనైనా పూజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |