![]() |
![]() |

'ఏ మాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సమంత.. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 'ది ఫ్యామిలీ మ్యాన్-2' వెబ్ సిరీస్ తో హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత.. 'శాకుంతలం', 'యశోద' వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అయితే ఈరోజు(ఏప్రిల్ 28) పుట్టినరోజు జరుపుకుంటున్న సమంతకి ఓ చేదు ఫలితం ఎదురైంది.
రెండేళ్ల తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించిన సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020 ఫిబ్రవరిలో 'జాను' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది సమంత. తమిళ్ మూవీ '96'కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. గతేడాది చివరిలో 'పుష్ప-1'లో 'ఊ అంటావా మావ' అంటూ స్పెషల్ సాంగ్ చిందేసి ఓ ఊపు ఊపిన సమంత.. తాజాగా 'కన్మణి రాంబో ఖతీజా' సినిమాతో పలకరించింది. విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన ఈ సినిమా నేడు(ఏప్రిల్ 28) విడుదలైంది. ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఆమెకి బర్త్ డే గిఫ్ట్ అని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ మూవీ సమంతకు చేదు ఫలితాన్ని మిగిల్చింది.

'కన్మణి రాంబో ఖతీజా' సినిమాకి నెగటివ్ టాక్ వస్తోంది. ముగ్గురు స్టార్స్ ని పెట్టుకొని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ సరైన సినిమా తీయలేకపోయాడంటూ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిల్లీ సీన్స్, సాగదీత స్క్రీన్ ప్లేతో డైలీ సీరియల్ ని తలపించేలా తీశాడని అంటున్నారు. ముఖ్యంగా సమంత చేత పలికించిన కొన్ని డైలాగ్స్ ఇబ్బందికరంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సినిమాలో నయన్ తనని రాంబో(విజయ్) పెళ్లి చేసుకున్నాడని చెప్తే.. సమంత ఏకంగా తనతో పడుకున్నాడని చెప్తుంది. ఆ డైలాగ్ మ్యూట్ చేసినప్పటికీ అది ఆడియన్స్ కి ఈజీగా అర్థమవుతుంది. దానిని సాగదీస్తూ బాదంపప్పు, పిస్తా పప్పుతో పోలుస్తూ నయనతార, సమంత చేత వెకిలి కామెడీ చేయించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. అసలే పాత కథ.. దానికి తోడు రొటీన్ సీన్స్, రొట్ట కామెడీతో 'కన్మణి రాంబో ఖతీజా' సినిమా సమంత బర్త్ డేకి బ్యాడ్ గిఫ్ట్ గా మిగిలిపోయిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
![]() |
![]() |