![]() |
![]() |

'కేజీఎఫ్ చాప్టర్-2' మరో మైలురాయిని అందుకుంది. తాజాగా 800 కోట్ల క్లబ్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా వారంరోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించిన కేజీఎఫ్-2 .. 10 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు 2.48 కోట్ల షేర్ రాబట్టిన కేజీఎఫ్-2 పది రోజుల్లో 70.16 కోట్ల షేర్(112.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇప్పటిదాకా ఈ సినిమా తెలంగాణలో 36.34 కోట్లు, ఆంధ్రాలో 23.97 కోట్లు, రాయలసీమలో 9.85 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా 345 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 10 రోజుల్లో 404.40 కోట్ల షేర్(817.25 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. పది రోజుల్లో కర్ణాటకలో 74.25 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 70.16 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 27.50 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 21.55 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 150.34 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 60.60 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, నార్త్, ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన కేజీఎఫ్-2 త్వరలోనే మిగతా చోట్లా ప్రాఫిట్స్ లోకి అడుగుపెట్టే అవకాశముంది.
![]() |
![]() |