![]() |
![]() |

`మహానటి`(2018)తో కథానాయికగా కీర్తి సురేశ్ స్థాయి పెరిగింది. అయితే, ఆ తరువాత మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి. కాగా, ఈ మే నెలలో ఆరు రోజుల వ్యవధిలో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో పలకరించబోతోంది ఈ కేరళకుట్టి.
ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకుడు సెల్వరాఘవన్ తో కలిసి కీర్తి సురేశ్ నటించిన తమిళ చిత్రం `సాని కాయిదమ్`. పగ-ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ సినిమా మే 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. తెలుగులో `చిన్ని` పేరుతో అదే రోజు అనువాద రూపంలోనూ అలరించనుందీ చిత్రం. కట్ చేస్తే.. మే 12న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి కీర్తి సురేశ్ నటించిన `సర్కారు వారి పాట` చిత్రం రిలీజ్ కి రెడీ అయింది. అంటే.. మే ప్రథమార్ధంలో కీర్తి సురేశ్ డబుల్ ధమాకా ఉండబోతోందన్నమాట. మరి.. మే ఫస్టాఫ్ లో రెండు వరుస వారాల్లో జనం ముందుకు రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కీర్తి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
కాగా, `చిన్ని`కి అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహించగా.. `సర్కారు వారి పాట`ని పరశురామ్ రూపొందిస్తున్నాడు.
![]() |
![]() |