![]() |
![]() |

శనివారం హైదరాబాద్ లో జరిగిన 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళికి సన్మానం జరిగింది. తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా చేసిన వ్యక్తి రాజమౌళి అంటూ ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి.. వేదికపై ఆయనను సన్మానించారు.
"1988 లో రుద్రవీణ సినిమాకి నర్గీస్ దత్ అవార్డు వస్తే అది తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళాము. అక్కడ భారతీయ సినిమా వైభవం అంటూ కొన్ని పోస్టర్స్ పెట్టారు. అందులో సౌత్ సినిమాలకి పెద్దగా ప్రాధాన్యత లేదు. మహా నటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రాజ్ కుమార్ గారు, శివాజీ గణేశన్ గారి ఫోటోలు లేవు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అన్నట్లు చూశారు. మనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా ఆవేదన కలిగింది" అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
"ఇప్పుడు నేను గర్వపడేలాగా, రొమ్ము విరుచుకునేలాగా.. మన తెలుగు సినిమా హద్దులు చెరుపుకొని, ఇది ఇండియన్ సినిమా అని మన తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునేలా 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చేశాయి. ఈ సినిమాలు రూపొందించిన రాజమౌళికి హ్యాట్సాఫ్. రాజమౌళి మన తెలుగువాడు కావడం మనకి గర్వ కారణం. తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం రాజమౌళిని మనం గుర్తుంచుకోవాలి. భారతీయ సినిమా ఒక మఠమైతే, దానికి పీఠాధిపతి రాజమౌళి. మన సినిమాని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి." అంటూ చిరంజీవి రాజమౌళి ఘనంగా సన్మానించారు.
![]() |
![]() |