![]() |
![]() |

'ఆచార్య' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు(శనివారం) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను పోషించిన ఆచార్య పాత్ర కంటే, రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్ర నచ్చిందని అన్నారు.
ఈ ఈవెంట్ ని హోస్ట్ చేసిన సుమ.. ఆడియెన్స్ అడిగారని చెబుతూ చిరంజీవి, చరణ్, కొరటాల శివలను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి చిరంజీవి చెప్పిన ఆన్సర్స్ ఆకట్టుకున్నాయి. 'మీ ఇంట్లో ఆచార్య ఎవరు? చిరంజీవా పవన్ కళ్యాణ్ ఆ?' అని చరణ్ ని సుమ అడగగా.. చరణ్ చెప్పలేకపోవడంతో.. 'నా నుంచి క్రమశిక్షణ, బాబాయ్ నుంచి చిలిపి పనులు నేర్చుకున్నాడు' అని చిరు సూపర్ ఆన్సర్ ఇచ్చారు.
'చిరంజీవి, చరణ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్?' అని కొరటాలను సుమ అడగగా.. 'నా పేరు శివశంకర వరప్రసాద్.. పేరులోనే శివుడున్నాడు.. శివుడు అంటేనే నాట్యం.. ఈ శివ తర్వాతే ఎవరైనా' అంటూ చిరు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. 'ఆచార్య, సిద్ధ పాత్రలలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది?' అని చిరుని సుమ అడగగా.. 'రెండూ ఓపెన్ గా పెట్టి చేయమంటే నేను సిద్ధ చేస్తాను. సిద్ధ పాత్రలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పి లీక్ చేయను' అంటూ చిరు చెప్పుకొచ్చారు.
![]() |
![]() |