![]() |
![]() |

చక్కని రూపలావణ్యం, మనోహర గాత్రం రెండూ ఉండేవారు అరుదు. అలాంటి అరుదైన సింగర్స్‌లో సునీత ఒకరు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో రెండో వివాహం తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తూ వస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు తెలియజేస్తుంటాయి. లేటెస్ట్‌గా ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కారణం.. మామిడిచెట్టు కింద మామిడికాయను పట్టుకొని "బ్లెస్డ్" అని ఆమె రాయడమే.
ఇప్పుడు జనాలు ఆ పోస్టుకు అర్థాలు వెతికే పనిలో పడ్డారు. ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీలు పులుపును ఇష్టపడతారనీ, అందులోనూ మామిడికాయను ఇంకా ఇష్టపడతారనీ తెలిసిందే. దానికి తోడు ఆమె "బ్లెస్డ్" అని రాయడంతో ఆమె తల్లి కాబోతోందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీడియా సైతం ఆ పోస్ట్‌కు అదే అర్థాన్ని చూస్తోంది.
సునీతకు మొదటి భర్తతో టీనేజ్ దాటిన కొడుకు, కూతురు ఉన్నారు. ఇప్పుడామె రెండో భర్త ద్వారా కూడా పిల్లల్ని కోరుకుంటోందా? తెలీదు. కానీ ఒక్కోసారి సోషల్ మీడియాలో యథాలాపంగా పెట్టే పోస్టులు చర్చలకు లేదా అపోహలకు దారితీస్తుంటాయి. సునీత లేటెస్టుగా పెట్టిన పోస్టు కేవలం సాధారణమైందేనా లేక అందులో నిజంగానే విశేషం ఉందా? చూద్దాం.. ఏమవుతుందో...

![]() |
![]() |