![]() |
![]() |

రి-ఎంట్రీలో `వకీల్ సాబ్`, `భీమ్లా నాయక్`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్వరలో ఆయన `హరిహర వీరమల్లు`తో పలకరించబోతున్నారు. వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ రూపొందిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో.. రాబిన్ వుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వబోతున్నారు పవన్. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో ఓ పిరియడ్ డ్రామాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే.. `హరిహర వీరమల్లు`లో పవన్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో 3 రకాల షేడ్స్ ఉన్న పాత్రలో పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ చేయబోతున్నారట. అంతేకాదు.. 30 రకాల కాస్ట్యూమ్స్ లో అభిమానులకు కనువిందు చేయనున్నారట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న `హరిహర వీరమల్లు`లో పవన్ కళ్యాణ్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. స్వరవాణి కీరవాణి ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ కి బాణీలు అందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో `హరిహర వీరమల్లు` తెరపైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |