![]() |
![]() |
.webp)
మల్టిటాలెంటెడ్ మహేశ్ మంజ్రేకర్ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సయీ మంజ్రేకర్. మొదటి చిత్రంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఆడిపాడిన ఈ అమ్మడు.. ఆపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించకపోవడంతో రాబోయే కొత్త చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది సయీ.
ఆ వివరాల్లోకి వెళితే.. `దబంగ్` ఫ్రాంచైజీలో మూడో సినిమాగా రిలీజైన `దబంగ్ 3`లో ఓ హీరోయిన్ గా నటించిన సయీ మంజ్రేకర్.. జస్ట్ యావరేజ్ తో సరిపెట్టుకుంది. అయితే, దక్షిణాది నుంచి పిలుపు రావడంతో.. `గని`, `మేజర్` చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీటిలో ముందుగా రిలీజైన `గని` గత శుక్రవారం విడుదలై డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో.. మే 27న విడుదలకు సిద్ధమైన `మేజర్`పైనే ఆశలు పెట్టుకుంది సయీ మంజ్రేకర్. మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ లో అడివి శేష్ కి జంటగా నటించింది సయీ. మరి.. `అమీ తుమీ`, `గూఢచారి`, `ఎవరు` వంటి వరుస విజయాలతో ముందుకు సాగుతున్న అడివి శేష్ అయినా సయీకి కలిసొస్తాడేమో చూడాలి.
![]() |
![]() |