![]() |
![]() |

వరుణ్‌తేజ్ టైటిల్ రోల్ చేసిన 'గని' సినిమా ఏప్రిల్ 8న విడుదలైంది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమైన ఈ మూవీని సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా ఫ్లాపైంది. బాక్సర్‌గా నటించేందుకు వరుణ్ తన శరీరాన్ని మార్చుకున్న తీరు ఆకట్టుకున్నా, ఏమాత్రం కొత్తదనం లేని కథ, వీక్ స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్స్‌తో ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. ఫలితంగా వరుణ్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలవనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఈ అభిప్రాయాన్ని బలపరిచేలా మంగళవారం స్వయంగా వరుణ్‌తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. "ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తున్న అభిమానం, ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై, వినమ్రుడనై ఉంటాను. 'గని' మేకింగ్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ నేను థాంక్స్ చెప్పుకుంటున్నా. మీరంతా, ప్రత్యేకించి నిర్మాతలు.. ఈ సినిమా కోసం మీ హృదయాన్నీ, ఆత్మనీ పెట్టి పనిచేశారు.
మీకొక మంచి సినిమా ఇవ్వాలని నిజమైన తపనతో, బాగా శ్రమించాం. అయితే మేం అనుకున్న విధంగా మా ఆలోచన తెరపైకి అనువాదం కాలేదు. నేనెప్పుడూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చెయ్యాలనే ఏకైక ఉద్దేశంతోనే ఏ సినిమాకైనా పనిచేస్తాను. కొన్నిసార్లు నేను సక్సెస్ అయ్యాను. కొన్ని సార్లు నేను నేర్చుకున్నాను. అయినప్పటికీ నేనెప్పుడూ కష్టపడి పనిచేయడాన్ని ఆపను." అని ఒక నోట్‌లో రాసుకొచ్చాడు వరుణ్.
ట్రేడ్ వర్గాలు చెప్పిన దాని ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గని' ప్రి బిజినెస్ విలువ రూ. 25 కోట్లు కాగా, బయ్యర్లకు రూ. 20 కోట్ల మేర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఈ మూవీ ఏ స్థాయిలో డిజప్పాయింట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ 2' లాంటి అత్యంత క్రేజీ ప్రాజెక్టుల మధ్య రిలీజ్ చేయడమే 'గని'కి తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

![]() |
![]() |