![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు నాటు' ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్ కి రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఓ వైపు నాటు నాటు సాంగ్ ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే మరోవైపు తారక్, చరణ్ అభిమానులు ట్విట్టర్ లో మాటల యుద్ధానికి దిగారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలైనప్పటి నుంచి మా హీరోనే బాగా చేశాడంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా గొడవపడుతున్నారు. ఇక ఇప్పుడు నాటు నాటు సాంగ్ లోనూ మా హీరోదే పైచేయి అంటూ ఇరు హీరోల ఫ్యాన్స్ వార్ స్టార్ట్ చేశారు. సినిమా క్లైమాక్స్ లో రామరాజు పాత్ర హైలైట్ అయినట్లు నాటు సాంగ్ లోనూ మా హీరోదే పైచేయి అని చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం మా హీరో యాక్టింగ్, డ్యాన్స్ ముందు చరణ్ తేలిపోతాడని.. అందుకే రాజమౌళి కావాలని అలా చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఆర్ఆర్ఆర్ లో చరణ్ పోషించిన రామ్ పాత్రకి, తారక్ పోషించిన భీమ్ పాత్రకి చాలా తేడా ఉంది. రామ్ చదువుకున్నాడు, అన్ని విషయాలు తెలుసు. కానీ భీమ్ అలా కాదు. అడవిని వదిలి తన గోండు జాతి పిల్లని కాపాడటం కోసం మొదటిసారి సిటీకి వచ్చాడు. అతనకి ఈ డ్యాన్స్ లు, ఇంగ్లీష్ మాటలు తెలీవు. అమాయకంగా ఉంటాడు. ఆ అమాయకత్వాన్నే సినిమా అంతా తన భీమ్ పాత్రలో పలికించాడు తారక్. నాటు నాటు సాంగ్ కి డ్యాన్స్ వేసేటప్పుడు కూడా కొత్తగా డ్యాన్స్ వేస్తున్నట్లు ఒక రకమైన అమాయకత్వాన్ని ముఖంలో చూపించాడు. కానీ రామ్ పాత్ర అలా కాదు. డ్యాన్స్ లోనూ, ఫేస్ లోనూ ఎనర్జీ చూపిస్తాడు. ఎందుకంటే అతనికి అవేమీ కొత్తకాదు. నిజానికి ఇద్దరు హీరోలు వారి పాత్రలకు తగ్గట్లు పూర్తి న్యాయం చేశారు. కానీ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఒకరినొకరితో పోల్చుతూ అనవసరపు వాదనకు దిగుతున్నారు.
![]() |
![]() |