![]() |
![]() |

'కేజీఎఫ్-2' సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఏకంగా తెలుగు స్టేట్స్ లో రూ.78 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క నైజాంలోనే 25 కోట్ల బిజినెస్ చేసింది. నైజాం రైట్స్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్నాడు. ఆయన రిక్వెస్ట్ తో తాజాగా తెలంగాణ ప్రభుత్వం 'కేజీఎఫ్-2'కి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇటీవల 'ఆర్ఆర్ఆర్'కి పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకుకునే అవకాశం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ఇప్పుడు 'కేజీఎఫ్-2'కి నాలుగు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది.
'కేజీఎఫ్-2'కి మొదటి నాలుగు రోజులు మల్టీప్లెక్స్ లకు రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి రూ.30 హైక్ ఇచ్చారు. పెరిగిన ధరలతో మొదటి నాలుగు రోజుల పాటు మల్టీప్లెక్స్ లలో రూ.350, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రూ.210 గా టికెట్ ధరలు ఉండనున్నాయి. ఐదో రోజు నుంచి సాధారణ టికెట్ ధరలు ఉండనున్నాయి.
అయితే ఒక డబ్బింగ్ సినిమాకి టికెట్ ధరల హైక్ ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇప్పటికే టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికితోడు ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా పెంచుకుంటూ పోతే ఎలా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |