![]() |
![]() |

ఈ వారం రెండు దక్షిణాది చిత్రాలు నేషనల్ వైడ్ గా ఎనలేని క్రేజ్ నడుమ విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలే.. `బీస్ట్`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`. కోలీవుడ్ మూవీ `బీస్ట్` రేపు (ఏప్రిల్ 13) పలు భాషల్లో రిలీజ్ కానుండగా.. ప్రధానంగా కన్నడంలో రూపొందిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` ఏప్రిల్ 14న పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా జనం ముందుకు రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు `బీస్ట్` దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కి, ఇటు `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఆయా సినిమాలు మూడో చిత్రాలే కావడం గమనార్హం. ఒకవైపు `కోలమావు కోకిల`, `డాక్టర్` చిత్రాలతో తమిళనాట రెండు మంచి విజయాలు అందుకున్న నెల్సన్.. `బీస్ట్`తో హ్యాట్రిక్ ని టార్గెట్ చేసుకున్నాడు. మరోవైపు `ఉగ్రం`, `కేజీఎప్ః ఛాప్టర్ 1`తో రెండు సెన్సేషనల్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`తో మూడో ఘనవిజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి.. ఈ ఇద్దరు కూడా `హ్యాట్రిక్` దర్శకులుగా నిలుస్తారేమో చూడాలి.
కాగా, `బీస్ట్`లో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించగా.. `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |