![]() |
![]() |

గ్యాంగ్ స్టర్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. `సత్య`(1998)తో ఈ తరహా సినిమాలకు శ్రీకారం చుట్టిన ఆర్జీవీ.. ఆపై పలు చిత్రాలతో ఆకట్టుకున్నారు. వాటిలో `కంపెనీ` (2002) ఒకటి. అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, మోహన్ లాల్, మనీషా కోయిరాలా, సీమా బిశ్వాస్, ఆంత్ర మాలి, ఆకాశ్ ఖురానా, రాజ్ పాల్ యాదవ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇషా కొప్పీకర్, ఊర్మిళ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంతోనే నటుడిగా తొలి అడుగేసిన వివేక్ ఒబెరాయ్.. `బెస్ట్ మేల్ డెబ్యూ`, `బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్` విభాగాల్లో రెండు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. అలాగే, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి హిందీలో ఇదే మొదటి సినిమా.
సందీప్ చౌతా సంగీతసారథ్యంలో రూపొందిన గీతాల్లో ``ఖల్లాస్`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``తుమ్ సే కిత్నా``, ``ప్యార్ ప్యార్ మేన్``, ``ఆంఖోన్ మే``, ``గంధా హై`` కూడా రంజింపజేశాయి. వర్మ కార్పోరేషన్, వైజయంతీ మూవీస్ పతాకాలపై రామ్ గోపాల్ వర్మ, సి. అశ్వనీదత్, బోనీ కపూర్ నిర్మించిన `కంపెనీ`.. `బెస్ట్ స్టోరీ` (జైదీప్ సహ్ని), `బెస్ట్ స్క్రీన్ ప్లే` (జైదీప్ సహ్ని), `బెస్ట్ మేల్ డెబ్యూ`, `బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్`, `బెస్ట్ ఎడిటింగ్` (చందన్ అరోరా), `బెస్ట్ యాక్టర్ - క్రిటిక్స్` (అజయ్ దేవగన్), `బెస్ట్ యాక్ట్రస్ క్రిటిక్స్` (మనీషా కోయిరాలా) - ఇలా ఏడు విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అందుకుని వార్తల్లో నిలిచింది. కాగా, 2002 ఏప్రిల్ 12న విడుదలై ఘనవిజయం సాధించిన `కంపెనీ`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |