![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఉగాది రోజు(ఏప్రిల్ 2)న పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని ఇటీవల 'ది కాశ్మీర్ ఫైల్స్'తో సంచలన విజయాన్ని అందుకున్న ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నేడు అభిషేక్ పుట్టినరోజు సందర్భంగా టైగర్ షూటింగ్ ని ప్రారంభించారు. 'వేట మొదలైంది' అంటూ షూటింగ్ లొకేషన్ లోని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.

స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో సందడి చేయనుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.
![]() |
![]() |