![]() |
![]() |

ఇండియన్ సినిమా చరిత్రలోనే వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన మూడో సినిమాగా సంచలనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' తాజాగా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించి సత్తా చాటింది. విడుదలైన రెండు వారాల్లోనే కర్ణాటక మినహా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. తాజాగా కర్ణాటకలోనూ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది.
17 వ రోజు ఆదివారం అందులోనూ శ్రీరామ నవమి కావడంతో ఆర్ఆర్ఆర్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించింది. 17 వ రోజు వరల్డ్ వైడ్ గా 12.91కోట్ల షేర్(26.35 కోట్ల గ్రాస్) రాబట్టిన ఆర్ఆర్ఆర్ తెలుగు రాష్ట్రాల్లో 4.71 కోట్ల షేర్(7.35 కోట్ల గ్రాస్) సాధించింది. ఇప్పటిదాకా 17 రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ రాబట్టిన రికార్డు 4.19 కోట్లతో బాహుబలి-2 పేరిట ఉండగా.. ఇప్పుడు దానిని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 17 రోజుల్లో 258.32 కోట్ల షేర్(389.35 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 17 రోజుల్లో 107.59 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సీడెడ్ లో 37 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 49 కోట్లు రాబట్టి 50 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. అలాగే ఆంధ్రాలో 84 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటిదాకా 101.73 కోట్లు కలెక్ట్ చేసి వంద కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది.
17 రోజుల్లో ఓవర్సీస్ లో 94.80 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 114.15 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 41.60 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 36.75 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 10.20 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 8.60 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) షేర్ రాబట్టి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది.
వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ ఆర్ఆర్ఆర్ 17 రోజుల్లో 564.42 కోట్ల షేర్(1029.35 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా బయ్యర్లకు దాదాపు 113 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో అత్యధిక లాభాలు సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. 508 కోట్ల లాభం(352 కోట్ల బిజినెస్)తో మొదటి స్థానంలో బాహుబలి-2, 186 కోట్ల లాభం(118 కోట్ల బిజినెస్)తో రెండో స్థానంలో బాహుబలి-1ఉన్నాయి.
![]() |
![]() |