![]() |
![]() |
.webp)
తారల్లో సాయిపల్లవి తీరే వేరు. ఎలాంటి భేషజాలూ పోకుండా వినయంగా నడుచుకునే అమ్మాయిగా పేరు తెచ్చుకున్న పల్లవి.. తాను మూలాలను ఎన్నటికీ మరచిపోనని తన ప్రవర్తనతో మరోసారి చాటి చెప్పింది. సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గానే ఉండే ఆమె, లేటెస్ట్గా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో ఆమె ఒక వ్యవసాయ కూలీగా కనిపిస్తోంది!
అవును. కొంతమంది మహిళా కూలీలతో పాటు తాను కూడా వ్యవసాయ కూలీగా మారిపోయి ఫొటో దిగింది. ఆ ఫొటోలో మిగతా ఆడవాళ్ల తరహాలోనే మెడ మీదుగా తల చుట్టూ కండువా కట్టుకొని పొలంలో నల్లమట్టి మీద కూర్చొని నవ్వుతూ పోజిచ్చింది పల్లవి. దాంతో పాటు భూమిలోంచి లాగేసిన అల్లం మొక్కలను, అల్లం గడ్డలను కూడా ఫొటోలు తీసి షేర్ చేసిందామె. ఆ ఫొటోలకు "Rooted… but Uprooting #Ugadisubhakankshalu " అనే క్యాప్షన్ పెట్టింది.
.webp)
అది ఏ ప్రాంతంలోనిదో పల్లవి అందులో రాయలేదు. ఏదేమైనా వ్యవసాయ కూలీలతో కలిసి, వారిలో ఒకమ్మాయిగా కనిపిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసుల్ని దోచేసింది. అనేకమంది ఆమె మంచి మనసునీ, ఆమె వ్యక్తిత్వాన్నీ ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. తోటి హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సైతం, "సాయిపల్లవీ నీలా ఎవరూ ఉండరు" అని కామెంట్ చేసింది. అనుపమా పరమేశ్వరన్ 'లవ్' ఎమోజీని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసింది.

![]() |
![]() |