![]() |
![]() |

రామ్ గోపాల్ వర్మ, శివ నాగేశ్వరరావు అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'మనీ' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి శివ నాగేశ్వరరావు సక్సెస్ అందుకున్నారు. ఆ వెంటనే వీరి కాంబినేషన్ లో 'మనీ మనీ' వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన శివ నాగేశ్వరరావు.. కొంత విరామం తర్వాత ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా టైటిల్ లుక్ ఆర్జీవీ రివీల్ చేయడం విశేషం.
IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా 'దోచేవారెవరురా'. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆర్జీవీ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. 'దోచేవారెవరురా' టైటిల్ చాలా బాగుంది అని.. సినిమా కూడా అంతే బాగుంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు. తనకు శివ నాగేశ్వరరావుతో మొదటి సినిమా నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ.. "రాముతో మాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయనతో నేను ఉన్నంత క్లోజ్ గా మా బ్యాచ్ లో ఎవరు ఉండరు. దర్శకుడిగా నాకు మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు థాంక్యూ" అని అన్నారు. ఈ చిత్రం లోఅజయ్ గోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |