![]() |
![]() |

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 25 న విడుదలై భారీ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో టెక్నీషియన్లకు గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు చరణ్.
ఆర్ఆర్ఆర్ కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన 35 మందిని ఆదివారం ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించాడు చరణ్. అల్పాహారం తర్వాత వారితో కాసేపు ముచ్చటించిన చరణ్.. అనంతరం వారందరికీ ఒక్కో తులం బంగారు కాయిన్ కానుకగా ఇవ్వడంతో పాటుగా స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా చరణ్ అన్నాడు.
![]() |
![]() |