![]() |
![]() |
.webp)
యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర తన ప్రభంజనాన్ని కంటిన్యూ చేస్తోంది. తెలుగునాట ఈ సినిమా పదో రోజు ఆదివారం రూ. 16.10 కోట్ల షేర్‌తో సత్తా చాటడమే కాకుండా, పదో రోజుల కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డును లిఖించింది. ఇదివరకు పదో రోజు కలెక్షన్ల విషయంలో తెలుగునాట రికార్డ్ 'బాహుబలి 2' పేరిట ఉంది. అది రూ. 8.55 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఈ రేంజ్లో దాన్ని ఓ రేంజ్లో దాటేసింది.
ఏపీ, తెలంగాణలో పది రోజులకు 'ఆర్ఆర్ఆర్' రాబట్టిన వసూళ్లు రూ. 231.70 కోట్ల (షేర్)కు చేరుకున్నాయి. దీంతో తెలుగునాట కలెక్షన్ల పరంగా 'ఆర్ఆర్ఆర్' సరికొత్త బెంచ్ మార్క్‌ను నిర్దేశించడం ఖాయమైంది. ఇప్పటికే రాజమౌళి మునుపటి మూవీ 'బాహుబలి 2' సాధించిన రూ. 204 కోట్ల రికార్డ్ కలెక్షన్లను 'ఆర్ఆర్ఆర్' తొమ్మిది రోజులకే దాటేసింది. దీంతో రానున్న రోజుల్లో 'నాన్-ఆర్ఆర్ఆర్' రికార్డ్ అనేది పరిగణనలోకి రానుంది. తెలుగునాట 'ఆర్ఆర్ఆర్' ప్రి బిజినెస్ విలువ రూ. 191 కోట్లు. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్లు అందుకుంటుండగా, ఆంధ్ర ఏరియాలోనూ ఒక్క నెల్లూరు మినహా మిగతా చోట్ల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి అడుగుపెట్టారు.
తెలుగునాట ఓవరాల్ కలెక్షన్ల విషయంలో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2' తర్వాత స్థానాల్లో 'అల.. వైకుంఠపురములో' (రూ. 130.17 కోట్లు), 'సరిలేరు నీకెవ్వరు' (రూ. 117.50 కోట్లు), 'బాహుబలి' (రూ. 114 కోట్లు) ఉన్నాయి. ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ మూవీ 'గని', ఏప్రిల్ 13న విజయ్ మూవీ 'బీస్ట్', ఏప్రిల్ 14న యశ్ సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజవుతున్నాయి. ఈ లోగా 'ఆర్ఆర్ఆర్' మరింతగా కలెక్షన్లను సాధించనుంది.
![]() |
![]() |