![]() |
![]() |

`ఛలో`, `భీష్మ` చిత్రాలకు వినసొంపైన బాణీలు అందించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరవారసుడు మహతి స్వర సాగర్. కాగా, ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతున్నాడు మహతి. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న `భోళా శంకర్`కి కూడా మహతి స్వర సాగర్ నే బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ నెలలో మహతి స్వర సాగర్ సంగీతసారథ్యంలో రూపొందిన ఓ సినిమా రాబోతోంది. ఆ చిత్రమే.. `కృష్ణ వ్రింద విహారి`. యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ 22న జనం ముందుకు వస్తోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఆ చిత్రం విడుదలైన వారం తరువాత అంటే ఏప్రిల్ 29న మణిశర్మ స్వరకల్పనలో తెరకెక్కిన `ఆచార్య` రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ మల్టిస్టారర్ తయారైంది. మరి.. ఫస్ట్ మహతి స్వర సాగర్, నెక్స్ట్ మణిశర్మ అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో వస్తున్న ఈ చిత్రాలతో ఈ తండ్రీతనయులు (మణి, మహతి) ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |