![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా రేపు గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. రేపే సినిమా ప్రీలుక్ ని కూడా విడుదల చేయనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా మరో అప్డేట్ వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుండగా, మరో బ్యూటీ కూడా సందడి చేయనుంది. ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్ కి లాగే గాయత్రి భరద్వాజ్ కి కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం. సినిమాలో ఈ ఇద్దరి పాత్రలు కీలకమని తెలుస్తోంది.
.webp)
గాయత్రి భరద్వాజ్ 'fbb కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018' గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిళ్లను కూడా గెలుచుకుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'దిండోరా'లో తన నటనకు ప్రశంసలు అందుకుంది.

టైగర్ నాగేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. స్టూవర్టుపురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' రవితేజకు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. ఇది రవితేజకు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్.
శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. మదీ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
![]() |
![]() |