![]() |
![]() |
.webp)
2022 ఫస్టాఫ్ లో హవా సాగిస్తున్న సంగీత దర్శకుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఫలితాల మాట పక్కన పెడితే.. `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, `ఖిలాడి`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` అంటూ ఇప్పటికే నాలుగు చిత్రాలతో పలకరించారు డీఎస్పీ. ఇక మే 27న హిలేరియస్ ఎంటర్టైనర్ `ఎఫ్ 3`తో సందడి చేయబోతున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మల్టిస్టారర్ పై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. 2022 ప్రథమార్ధంలో జోరు చూపించిన దేవి శ్రీ ప్రసాద్.. 2022 ద్వితీయార్ధంలోనూ అదే తీరు కొనసాగించే అవకాశముంది. మరీముఖ్యంగా.. జూలై నెల ఫస్టాప్ లో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో ఎంటర్టైన్ చేయనున్నారు దేవి శ్రీ. ఆ చిత్రాలే.. `రంగ రంగ వైభవంగా`, `ద వారియర్`. `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్, `రొమాంటిక్` ఫేమ్ కేతికా శర్మ జంటగా గిరీశయ్య రూపొందిస్తున్న `రంగ రంగ వైభవంగా` జూలై 1న రిలీజ్ కానుండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్, `ఉప్పెన` భామ కృతి శెట్టి జోడీగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న `ద వారియర్` జూలై 14న విడుదల కానుంది. మరి.. జూలై ప్రథమార్ధంలో రానున్న ఈ సినిమాలతో డీఎస్పీ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |