![]() |
![]() |

2022 క్యాలెండర్ ఇయర్.. మల్టిస్టారర్ మూవీస్ కి బాగానే కలిసొస్తుందనే చెప్పాలి. ఈ ఏడాదిలో నెలకో మల్టిస్టారర్ చొప్పున ఇప్పటివరకు మూడు మల్టిస్టారర్స్ సందడి చేశాయి. ఈ సినిమాలన్నీ కూడా `నాన్ - ఫెయిల్యూర్` జాబితాలో చేరడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. జనవరి 14న జనం ముందుకొచ్చిన `బంగార్రాజు`లో కింగ్ నాగార్జున, ఆయన తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించగా.. ఫిబ్రవరి 25న విడుదలైన `భీమ్లా నాయక్`లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా సందడి చేశారు. ఈ రెండు మల్టిస్టారర్ సినిమాలు కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించాయి. ఇక మార్చి 25న రిలీజైన సిసలైన మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` కూడా పాన్ - ఇండియా మూవీగా రిలీజై వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో డైరెక్టర్ నంబర్ వన్ రాజమౌళి ఈ పిరియడ్ డ్రామాని రూపొందించారు.
మరి.. జనవరిలో `బంగార్రాజు`, ఫిబ్రవరిలో `భీమ్లా నాయక్`, మార్చిలో `ఆర్ ఆర్ ఆర్` అంటూ నెలకో మల్టిస్టారర్ అలరిస్తున్న నేపథ్యంలో.. ఏప్రిల్ 29న రానున్న మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ `ఆచార్య` కూడా ఇదే బాటలో పయనించి విజయపరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |