![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్నారు. ఓవైపు మోహన్‌రాజా డైరెక్షన్‌లో 'గాడ్‌ఫాదర్', మరోవైపు మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్న ఆయన, బాబీ డైరెక్షన్‌లోనూ ఓ సినిమాని చేస్తున్నారు. ఇంత తీరిక లేని షెడ్యూల్‌లోనూ ఆయన సుకుమార్ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అది సినిమా కోసం కాదు.. ఓ యాడ్ కోసం.
ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించిన చిరంజీవి, దానికి సంబంధించిన ఓ యాడ్‌లో నటించారు. ఆ యాడ్‌ను రూపొందించింది.. సుకుమార్. ఇంతదాకా వెండితెరకు సంబంధించి చిరును డైరెక్ట్ చేయకపోయినా, ఈ యాడ్ కోసం ఆయనను డైరెక్ట్ చేశాడు సుక్కు.
ఈ విషయాన్ని ఈరోజు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసుకున్నారు చిరు. సెట్స్‌లో సుకుమార్‌తో దిగిన రెండు ఫొటోలను పంచుకున్న ఆయన, "దర్శకుడుగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ ad film కోసం, వారి దర్శకత్వం లో షూటింగ్ నేను చాలా enjoy చేశాను." అని రాసుకొచ్చారు.

![]() |
![]() |