![]() |
![]() |

తెలుగునాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు ఎస్.ఎస్. రాజమౌళి. తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`తోనూ మరోసారి విజయకేతనం ఎగురవేసి టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారీ దర్శకధీరుడు.
ఇదిలా ఉంటే, టాలీవుడ్ లో రాజమౌళి హీరోలకి సంబంధించి ఓ నెగటివ్ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. జక్కన్న కాంబోలో బ్లాక్ బస్టర్ కొట్టాక ఏ హీరో అయినా వెనువెంటనే ఫెయిల్యూర్ చూడాల్సి రావడం. `స్టూడెంట్ నెంబర్ వన్` తరువాత `సుబ్బు`.. `సింహాద్రి` అనంతరం `ఆంధ్రావాలా`.. `యమదొంగ` తరువాత `కంత్రి` రూపంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఫ్లాప్స్ చూస్తే.. `సై` పిదప `ధైర్యం`తో యూత్ స్టార్ నితిన్ ఫెయిల్యూర్ అందుకున్నాడు. అలాగే `ఛత్రపతి` తరువాత `పౌర్ణమి`తోనూ.. `బాహుబలి` సిరీస్ అనంతరం `సాహో`తోనూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అదే బాట పట్టాడు.
అదే విధంగా `విక్రమార్కుడు` తరువాత `ఖతర్నాక్`తో మాస్ మహారాజా రవితేజ, `మగధీర` అనంతరం `ఆరెంజ్`తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, `మర్యాద రామన్న` తరువాత `కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు`తో హీరోగా సునీల్, `ఈగ` అనంతరం `ఎటో వెళ్ళిపోయింది మనసు`తో నేచురల్ స్టార్ నాని కూడా సేమ్ పాథ్ లో వెళ్ళక తప్పలేదు. ఈ నేపథ్యంలో.. `ఆర్ ఆర్ ఆర్` స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదుపరి చిత్రాలపై పరిశ్రమలో, ఫ్యాన్స్ లో ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు తారక్, ఇటు చరణ్ నుంచి రాబోయే సినిమాలు కొరటాల శివ డైరెక్టోరియల్స్ నే కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో చరణ్ సెకండ్ హీరోగా రూపొందిన కొరటాల డైరెక్టోరియల్ `ఆచార్య` ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుండగా.. తారక్ నెక్స్ట్ వెంచర్ కూడా కొరటాల కాంబోలోనే పాన్ - ఇండియా మూవీగా రాబోతోంది. మరి.. రాజమౌళి నెగటివ్ ఎఫెక్ట్ ని అధిగమించి మరీ కొరటాల కాంబినేషన్ లో తారక్, చరణ్ విజయాలు అందుకుంటారో లేదో చూడాలి.
![]() |
![]() |