![]() |
![]() |

పాన్ - ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం `కేజీఎఫ్` ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పిరియడ్ యాక్షన్ ఫిల్మ్ తో రాకింగ్ స్టార్ యశ్ పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ పొందగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ - ఇండియా కెప్టెన్ అనిపించుకున్నాడు. కాగా, ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా రూపొందిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇదిలా ఉంటే, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` తాలూకు రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 168 నిమిషాల (2 గంటల 48 నిమిషాలు) నిడివితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంటర్టైన్ చేయనుంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `కేజీఎఫ్` తొలి భాగం 155 నిమిషాలు (2 గంటల 35 నిమిషాలు) డ్యూరేషన్ తో రిలీజైంది. మరి.. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ రన్ టైమ్ తోనే రాబోతున్న `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లోనూ శ్రీనిధి శెట్టి కథానాయికగా కొనసాగుతుండగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరీ రావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
![]() |
![]() |