![]() |
![]() |

మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఇప్పటివరకు తొమ్మిది చిత్రాలు తెరకెక్కించారు. వాటిలో నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందించిన సినిమాలు (`సింహా`, `లెజెండ్`, `అఖండ`) మాత్రమే ద్విపాత్రాభినయ కథలతో తెరకెక్కాయి. కట్ చేస్తే.. త్వరలో బోయపాటి నుంచి మరో `డ్యూయెల్ రోల్` మూవీ రాబోతోందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో బోయపాటి శ్రీను ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రూపొందించనున్న సంగతి తెలిసిందే. రాపో కెరీర్ లో ఇది 20వ సినిమాకాగా.. బోయపాటికి పదో చిత్రం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనున్న ఈ మూవీ కోసం రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. అంతేకాదు.. తనే హీరో, తనే విలన్ అని బజ్. అలాగే, ప్రతినాయకుడి తరహా పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, రామ్ తాజా చిత్రం `ద వారియర్` జూలై 14న రిలీజ్ కానుంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ బైలింగ్వల్ మూవీలో రామ్ సరసన `ఉప్పెన` భామ కృతి శెట్టి సందడి చేయనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |