![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన `లోఫర్`(2015) చిత్రంతో కథానాయికగా తొలి అడుగేసింది ఉత్తారాది భామ దిశా పటాని. ఆపై హిందీ చిత్రాలతో బిజీగా మారిన ఈ హాట్ బ్యూటీ.. త్వరలో దక్షిణాదిలో రి-ఎంట్రీ ఇవ్వబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ స్టార్ విజయ్ - టాలీవుడ్ కెప్టెన్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ బైలింగ్వల్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇద్దరు కథానాయికలకు స్థానముందట. మెయిన్ లీడ్ గా కృతి సనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా దిశా పటానిని ఎంపిక చేశారని సమాచారం. అదే గనుక నిజమైతే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం దిశ తెలుగులో సందడి చేయబోతున్నట్లే. త్వరలోనే విజయ్ - వంశీ పైడిపల్లి కాంబో మూవీలో దిశా పటాని ఎంట్రీపై క్లారిటీ రానున్నది. మరి.. ఈ సినిమాతోనైనా తెలుగులో దిశ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
కాగా, విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. వచ్చే నెలలో పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. 2023 ఆరంభంలో రిలీజ్ అయ్యే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |