![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటిటి, శాటిలైట్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
'గని' సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటీటీ, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. థియేటర్స్ లో విడుదలవుతున్న యంగ్ హీరో సినిమా రైట్స్ ఈ స్థాయిలో అమ్ముడవ్వడం విశేషమనే చెప్పాలి. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
గని మూవీ ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
![]() |
![]() |