![]() |
![]() |

'ప్రతిరోజూ పండగే' లాంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న, హిట్ మూవీ 'సీటీమార్' తర్వాత గోపీచంద్ హీరోగా నటిస్తోన్న సినిమా 'పక్కా కమర్షియల్'. రాశీ ఖన్నా హీరోయిన్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఈ సినిమాని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిజానికి ఈ మూవీని మే 20న రిలీజ్ చేయాలని ఇదివరకు అనుకున్నారు. వరుసగా పెద్ద సినిమాలు వస్తుండటంతో ఇప్పుడు రిలీజ్ డేట్‌ను మార్చారు.
ఇప్పటికే టైటిల్ కు ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి అటు సాధారణ ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ మధ్యే విడుదలైన 'పక్కా కమర్షియల్' టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారని చిత్ర బృందం తెలిపింది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్', 'టాక్సీవాలా', 'ప్రతి రోజూ పండగే' లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్ లో 'పక్కా కమర్షియల్' సినిమా వస్తోంది. 'ప్రతి రోజూ పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత.
రావు రమేశ్, సప్తగిరి మరో రెండు కీలక పాత్రల్లో కనిపించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా, ఎడిటింగ్: ఎన్.పి. ఉద్భవ్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, నిర్మాత: బన్నీ వాస్.

![]() |
![]() |