![]() |
![]() |

వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ తాజా చిత్రం `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టిస్టారర్ పై తెలుగునాట మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే, `ఆచార్య` తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు కొరటాల శివ. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజయ్యే అవకాశముంది. కాగా, `ఎన్టీఆర్ 30` విడుదలయ్యేలోపు మరో పాన్ - ఇండియా సినిమాని పట్టాలెక్కించనున్నారట శివ. అంతేకాదు.. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోలుగా నటించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇక అటు ధనుష్, ఇటు బన్నీ.. ఇద్దరు కూడా పాన్ - ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందిన కథానాయకులే. ఒకవేళ.. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే గనుక బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ ఖాయమనే చెప్పొచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో!
![]() |
![]() |