![]() |
![]() |

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిసున్న లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్'. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ దర్శకుడు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లలు ప్రయత్నిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించడం ఆకట్టుకుంది. ఏప్రిల్ 1 న థియేటర్స్ లో విడుదల కానున్న ఈ మూవీపై సినీప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు.
సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. రేపు(మార్చి 30) సాయంత్రం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి హాజరు అవుతుండటం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాని కూడా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థనే నిర్మించింది . ఈ నేపథ్యంలోనే వారు అడిగిన వెంటనే ఈ ఈవెంట్ కి రావడానికి చిరంజీవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి 'మిషన్ ఇంపాజిబుల్' కోసం అప్పుడు సూపర్ స్టార్ ని, ఇప్పుడు మెగాస్టార్ ని రంగంలోకి దింపడం ఆసక్తికరంగా ఉంది.

దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |