![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషించిన మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 8 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సౌత్ లో 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రదర్శితమవుతున్న ఎన్నో థియేటర్స్ లో ట్రైలర్ ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా గ్రాండ్ ప్రీరిలీజ్ కి రెడీ అవుతున్నారు.
ఒకప్పుడు మూవీ ప్రీరిలీజ్ వేడుకలు, సక్సెస్ మీట్ లు ఎక్కువగా హైదరాబాద్ లోనే జరిగేవి. అయితే కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మిగతా ప్రాంతాలలోనూ సినిమా వేడుకల నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గని ప్రీరిలీజ్ వేడుకకు వైజాగ్ వేదిక కానుంది. ఏప్రిల్ 2 న వైజాగ్ లో నిర్వహిస్తున్న గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా రానున్నాడని తెలుపుతూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఆమధ్య 'అఖండ' ప్రీరిలీజ్ ఈవెంట్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా రాగా.. ఆ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ గనికి కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.

'గని' మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా 'కొడితే' అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది.
![]() |
![]() |