![]() |
![]() |

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమాదాస్', 'హిట్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లోనూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే 'అక్టోబర్ 31 లేడీస్ నైట్' అనే మూవీలో కీ రోల్ లో నటిస్తున్న విశ్వక్ తాజాగా మరో సినిమాలో స్పెషల్ రోల్ లో నటించడానికి ఓకే చెప్పాడు.
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో గంగాధర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ముఖచిత్రం'. ఈ మూవీలో లాయర్ విశ్వామిత్ర అనే ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. నేడు(మార్చి 29) విశ్వక్ పుట్టినరోజు కావడంతో తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. లాయర్ కోటు ధరించి కోర్టులో టేబుల్ మీద చేతులు పెట్టి ఇంటెన్స్ లుక్ తో విశ్వక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి.. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించాడు. కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |