![]() |
![]() |

ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన 'ఆర్ఆర్ఆర్' వర్కింగ్ డేస్ లోనూ జోరు కొనసాగిస్తోంది. సోమవారం ప్రపంచవ్యాప్తంగా రూ.35.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే 300 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్ల షేర్ వసూలు చేసిన ఆర్ఆర్ఆర్.. రెండో రోజు 31.63 కోట్లు, మూడో రోజు 33.53 కోట్లు, నాలుగో రోజు 17.73 కోట్లతో ఇప్పటిదాకా 157 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన 'ఆర్ఆర్ఆర్'.. నాలుగు రోజులకే 82 శాతం రికవరీ సాధించింది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ అప్పుడే 61.65 కోట్లు రాబట్టింది. అలాగే సీడెడ్ లో 31.82 కోట్లు(బిజినెస్ 37 కోట్లు), ఆంధ్రాలో 63.53 కోట్లు(బిజినెస్ 84 కోట్లు)తో సత్తా చాటింది. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటే అవకాశముంది.
వరల్డ్ వైడ్ గా మొదటిరోజు 135 కోట్లు, రెండో రోజు 67.44 కోట్లు, మూడో 78.73 కోట్లు, నాలుగో రోజు 35.88 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ నాలుగు రోజుల్లో 317.05 కోట్ల షేర్(565 కోట్ల గ్రాస్)తో సంచలనం సృష్టించింది. ఓవర్సీస్ లో 63.80 కోట్లు, హిందీ 45.50 కోట్లు, కర్ణాటక 22.30 కోట్లు, తమిళనాడు 18.90 కోట్లు, కేరళ 5.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 4.20 కోట్లతో అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఆర్ఆర్ఆర్ మరో 135.95 కోట్లు రాబడితే క్లీన్ హిట్ గా నిలవనుంది. ఇదే జోరు కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఆర్ఆర్ఆర్ బయ్యర్లు లాభాలు చూసే అవకాశముంది.
![]() |
![]() |