Home  »  News  »  బన్నీ వాసుపై లైంగిక ఆరోపణలు.. సునీత బోయ వెనకున్న వ్యక్తులపై చర్యలు!

Updated : Mar 28, 2022

జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ కొంతకాలంగా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిర్మాత బన్నీ వాస్‌ ని టార్గెట్ చేస్తూ అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఆమె బన్నీ వాస్‌ పై ఆరోపణలు చేసింది. దీంతో బన్నీ వాస్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు సునీతకు మతి స్థిమితం సరిగా లేదని, అందుకే ఇలా మాట్లాడుతుందని ఆ సమయంలో ఆమె తల్లి చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే, సునీత మళ్ళీ బన్నీ వాస్‌ పై ఆరోపణలు చేస్తుండటంతో.. తాజాగా స్పందించిన బన్నీ వాస్‌ టీమ్ అధికారిక వివరణ ఇచ్చింది.

"2019 నుంచి ఇప్పటి వరకు సునీత బోయ.. గీతా ఆర్ట్స్ సంస్థ, అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. అయితే ఆమె జీవితంలో ఏదో బాధలో ఉందేమో లేక సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో మొదట్లో బన్నీ వాస్ వదిలేసారు. కానీ ఆమె మాత్రం బన్నీ వాస్ ని మాత్రమే కాకుండా.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుడు, బంధువులను కూడా రాతల్లో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ కావాలనే రెచ్చగొడుతుంది. అలాగే బన్నీ వాస్ 4 సంవత్సరాల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఇంతకి దిగజారిన తర్వాత.. మరో దారి లేక బన్నీ వాస్ న్యాయబద్ధంగా పోరాడాలని.. పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేసారు. 

పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్ పై మరింత పగ పెంచుకున్న సునీత.. తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లింది. తనను లైంగిక వేధింపులకు గురి చేసాడని కొత్త కట్టుకథతో ముందుకొచ్చింది. విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా సునీత బోయ అనే అమ్మాయిని బన్నీ వాస్ కలవలేదు. అసలు పరిచయమే లేని వ్యక్తిపై.. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది సునీత. అంతేకాదు బన్నీ వాస్ పై దాడులకు కూడా ప్రయత్నం చేసింది. దీంతో బన్నీ వాస్ ఫిర్యాదు మేరకు ఆమెను 3 నెలల పాటు విజయవాడ సబ్ జైలులో శిక్ష వేసారు. ఆ కోపంతో మరింత తీవ్రస్థాయిలో వేధిస్తుంది సునీత. అయినా కూడా ఓపిగ్గా భరిస్తున్న బన్నీ వాస్.. ఈ విషయాన్ని కేవలం చట్ట ప్రకారం మాత్రమే పరిష్కరించుకోవాలని చూస్తున్నారు.

సునీత బోయ చేసిన ఏ ఆరోపణ తీసుకున్నా కూడా నిరాధారంగా.. అలాగే ఒకదానితో మరోటి సంబంధం లేకుండా ఉంటాయి. ఆమె తప్పుడు స్టేట్‌మెంట్ ఇస్తూ కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అందరికీ తెలిపేదేమనగా.. దయచేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని మనవి. బన్నీ వాస్ పై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని.. HRCతో పాటు సంబంధిత గౌరవ విచారణ, జిల్లా హైకోర్టులలో ఈమెకు వార్నింగ్స్ వచ్చాయి. అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆరోపణలు చేస్తుంది. ఇలా చేయడం అనేది కోర్టు ధిక్కరణే. తీర్పు వచ్చిన తర్వాత కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని వివరిస్తాము. అంతేకాదు దీని వెనుక ఉన్న వ్యక్తులపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం."






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.