![]() |
![]() |

టాలీవుడ్ లో ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన సినిమా 'డీజే టిల్లు'. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 12 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ మూవీ అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సెలబ్రిటీస్ సైతం ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. ఇటీవల ఈ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడంతో సిద్ధు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తారక్ 'డీజే టిల్లు'ని ప్రశంసించాడు. సినిమా బాగుందని, సిద్ధు చాలా బాగా నటించాడని, అతని యాక్టింగ్ కి ఫిదా అయ్యాయని తారక్ అన్నాడు. ఈ వీడియో క్లిప్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సిద్ధు తన ఆనందాన్ని పంచుకున్నాడు.

"నా ఫస్ట్ అవార్డు ఇచ్చేశావ్ తారక్ అన్న. మీరు స్వచ్ఛమైన మనిషి. థాంక్యూ. చాలా హ్యాపీగా ఉంది.. మాటలు రావట్లేదు. ఎంతైనా పులి పులే. బిగ్ హగ్" అంటూ సిద్ధు తన సంతోషాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశాడు.
![]() |
![]() |