![]() |
![]() |

నటుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానీ తో ప్రేమలో ఉన్న ఆది.. తాజాగా ఆమెతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీ తో ఆది పినిశెట్టి ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. నిక్కీ ఎవరో కాదు.. 'బుజ్జిగాడు' సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించిన సంజనా గల్రానీకి స్వయానా చెల్లెలు. 2016 లో వచ్చిన 'కృష్ణాష్టమి' మూవీలో సునీల్ సరసన హీరోయిన్ గా నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిక్కీ. అదే ఏడాది ఆది సరసన 'మలుపు' అనే ద్విభాషా చిత్రంలో నటించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో నిక్కీ, ఆది మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో తాజాగా ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ మార్చి 24న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపిన ఆది.. ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేశాడు.
ఇటీవల 'క్లాప్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆది.. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న బైలింగువల్ మూవీ 'ది వారియర్' లో విలన్ గా నటిస్తున్నాడు.
![]() |
![]() |