![]() |
![]() |

ఫస్ట్ డే కలెక్షన్స్ లో 'బాహుబలి-2' రికార్డుని బ్రేక్ చేసిన 'ఆర్ఆర్ఆర్' రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల షేర్ మార్క్ దాటి భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.
తెలుగురాష్ట్రాల్లో మొదటి రోజు 74.11 కోట్ల షేర్ రాబట్టిన ఆర్ఆర్ఆర్ రెండో రోజు కూడా రికార్డు స్థాయిలో 31.63 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రెండో రోజు బాహుబలి-2 తెలుగు రాష్ట్రాల్లో 14.80 కోట్లు రాబట్టగా.. ఆర్ఆర్ఆర్ ఒక్క నైజాం ఏరియాలోనే 15.10 కోట్లు వసూలు చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 191 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే 105.74 కోట్ల షేర్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో నైజాంలో 38.45 కోట్లు, సీడెడ్ 22.50 కోట్లు, ఆంధ్రాలో 44.79 కోట్లతో సత్తా చాటింది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గానూ 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో 46.20 కోట్లు, హిందీ 21.50 కోట్లు, కర్ణాటక 12.60 కోట్లు, తమిళనాడు 10 కోట్లు, కేరళ 3.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 3.30 కోట్లతో కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 202.44 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తోంది.
![]() |
![]() |